వరద స్మృతులు వీడకముందే తీవ్ర నీటి ఎద్దడి - చెన్నైకి ఎందుకీ దుస్థితి?

చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తిన స్మృతులు ఇంకా వీడకముందే, అక్కడ తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. హాలీవుడ్ నటుడు డికాప్రియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా దీనిపై స్పందించారంటేనే, అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

నగరంలో నీటి సంక్షోభం తీవ్రత 

నగరంలో ఉన్న నీటివనరులు, రిజర్వాయర్లు దాదాపుగా ఎండిపోయాయి. సాధారణ నీటి సరఫరాలో మూడవ వంతు సరఫరా చేయడానికే ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. విద్యార్థులు తమ ఇళ్ల నుండే మంచి నీరు తెచ్చుకోవాలని స్కూలు యాజమాన్యాలు సూచిస్తున్నాయి. భారీ సంఖ్యలో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఇళ్లలో, సంస్థలలో మరుగు దొడ్ల నిర్వహణ గగనంగా మారింది. చాలా వరకు ఐటీ సంస్థలు ఉద్యోగులను ఇళ్ల నుండే పనిచేయమని కోరుతున్నాయి. ప్రజలు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ట్యాంకర్లకు నాలుగు వారాల వరకు ముందస్తు బుకింగ్ నడుస్తుంది. బ్లాకులో వాటి ధర చుక్కలనంటుతోంది. రాష్ట్ర హైకోర్టు నీటికొరతపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది.     

చెన్నై నగరానికి ఎందుకీ దుస్థితి

భారత దేశంలో అత్యధిక వర్షపాతం కలిగిన నగరాల్లో చెన్నై ఒకటి. గత సంవత్సరమే వరదలతో అతలాకుతలమైన నగరం, అంతలోనే మూడున్నర దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నీటి కొరతను ఎదుర్కొనడం మన నగర ప్రణాళికలలో గల తీవ్ర లోపాలను ఎత్తిచూపుతుంది. వర్షం ద్వారా వచ్చే నీటిని సేకరించే సామర్థ్యంగాని, నిలువ ఉంచే వ్యవస్థలు గాని మన నగరాలకులేవు. ఉన్న నీటి వనరులు ఎప్పుడో ఆక్రమణకు గురై, నగరాలు కాంక్రీటుతో నిండిపోయాయి. చుక్క నీరు భూమిలోకి ఇంకటం గగనంగా మారింది. వర్షంలో 98% సముద్రం పాలవవలసిందే. మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆకాశం వంక వర్షం కోసం చూస్తూ దేబిరించడమే.           

ప్రభుత్వం ప్రకటించిన చర్యలు సాధ్యమయ్యేవేనా?

చెన్నై నగరంలో 210 చెరువులను పునరుద్ధరిస్తామని, ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాని, ఒకసారి ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్దరించటం మన పాలకులకు సాధ్యమయ్యే పనేనా? వేలాది చెరువులతో కళకళలాడిన చెన్నపట్నానికి ఇప్పుడు డీ-శాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడవలసిన దుస్థితి నెలకొంది. భవిష్యత్తులో వాయు కాలుష్యం, నీటి కొరతలు పెరిగి  మనదేశ నగరాలలో జీవితం మరింత దుర్భరమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 





A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on

0/Post a Comment/Comments

Previous Post Next Post