కొత్త సచివాలయం మరియు అసెంబ్లీ భవనాలు అందుకోసమేనా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో సరిపోయిన సచివాలయం మరియు అసెంబ్లీ భవనాల స్థానంలో, కొత్త భవనాలను నిర్మించ తలపెట్టారు. ఆయన కొత్తగా వీటిని నిర్మించడం వెనక రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.   
  • రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు, తన గుర్తింపును హైదరాబాద్ నగరంపై శాశ్వతంగా ముద్ర వేయదలచుకున్నారు. అందుకే  ఇప్పుడు కొత్త సచివాలయం మరియు అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. 
  • రాష్ట్ర సచివాలయానికి వాస్తు దోషం ఉందని కెసిఆర్ గారు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రుల కుమారులెవరూ, ముఖ్యమంత్రులు కాలేకపోయారు. చెన్నారెడ్డి, వైఎస్ఆర్, ఎన్‌టిఆర్‌ల కుమారులు, అందుకే సిఎం పీఠం ఎక్కలేకపోయారు. ఆ దోషాల్ని తొలగించేందుకే కొత్త నిర్మాణాలు చేపట్టారు.   
ప్రస్తుతం ఆ భవనాలు రాష్ట్రానికి సరిపోవనే ప్రశ్నే ఉత్పన్నం కాదు, కాబట్టి ఈ రెండు వాదనలు ప్రజలలోకి వెళ్లాయి. టిఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ వాదనలను కొట్టిపడేస్తున్నాయి. కేవలం ఈ కాలానికి తగినట్లుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నిర్మాణాల వల్ల పాలన వేగవంతమవుతుందని వారు అంటున్నారు. కానీ, ప్రభుత్వం నుండి గాని, కెసిఆర్ నుండి గాని ఎటువంటి వివరణ లేదు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post