పెరిగిన ఉష్ణోగ్రతలు - రికార్డు స్థాయిలో బీరు అమ్మకాలు

తెలంగాణాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో, బీరు అమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఏకంగా 61 లక్షల కేసుల బీరును విక్రయించినట్లు రాష్ట్ర బేవరేజెస్ సంస్థ తెలిపింది. ఏప్రిల్ నెలలో ఈ అమ్మకాలు 53 లక్షల కేసులుగా ఉన్నాయి. గత ఏడాది మే నెలలో ఈ అమ్మకాలు, 57 లక్షల కేసులు కావడం గమనార్హం.       

రాష్ట్రంలో నీటికొరత వల్ల మెదక్, రంగారెడ్డి జిల్లాలలో కొన్ని బ్రూవరీలకు జిల్లా కలెక్టర్లు నీటి సరఫరాను నియంత్రించడంతో బీరు ఉత్పత్తి తగ్గినా, ఈ స్థాయి అమ్మకాలు నమోదయ్యాయి. ఇలా ఉత్పత్తి తగ్గడం వలన కొన్ని బ్రాండ్ల బీర్ల కొరత ఏర్పడింది. ప్రీమియమ్ బ్రాండ్ల సరఫరా బాగానే ఉన్నప్పటికీ, ప్రజాదరణ ఉన్న సాధారణ బ్రాండ్లలోనే కొరత ఏర్పడిందని అమ్మకందారులు చెబుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post