చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో 'సమీక్ష' నిర్వహించారు. దానిలో చర్చకు వచ్చిన అంశాలు, షరా మామూలుగా 'ఆ' పత్రికలలో లీకు రూపంలో వెలువడ్డాయి.
ప్రభుత్వాలు మారినా విధానాలు మారవని, తను ప్రకటించిన రుణమాఫీ 4, 5 విడతలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే అని చంద్రబాబు అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు రైతులకు మాఫీపై న్యాయపరమైన హక్కును కల్పించామని, వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే కోర్టుకెళ్లమని బాబు నేరుగా అనలేదన్నమాట. అక్కడ ఉన్న 'పేరు లేని' ఎమ్మెల్యేలు ఎవరో అభిప్రాయపడ్డారు.
అంతేకాక ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిన రైతు భరోసా రబీ నుంచి అమలు చేస్తున్నందున, ప్రస్తుత ఖరీఫ్‌కి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని సూచించారు.
Post a Comment