కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకమా?

ఇంటర్ విద్యార్థులకు కూడ అమ్మ ఒడి పథకాన్ని వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తెల్లరేషన్ కార్డులు  ఉన్న విద్యార్థుల తల్లులందరికీ అమ్మ ఒడి పథకం కింద ఏటా 15 వేల రూపాయలు చెల్లించనున్నారు. హాస్టల్, కార్పొరేట్, రెసిడెన్షియల్  విద్యార్థులకు కూడ అమ్మఒడి పథకం వర్తింప చేయనున్నారు. 

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని వర్తింపచేయడంపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ కళాశాలలకు ఈ పథకాన్ని వర్తింపచేయడం అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నష్టపరిచే నిర్ణయమే. ఇది తన విద్యావ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తుంది.  

ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలలో ఉద్యోగుల జీత భత్యాలు, నిర్వహణ కోసం ఒక్కో విద్యార్థిపై సగటున 25 వేల రూపాయల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. అయినా ప్రజలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపైనే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ల, కళాశాలల సిబ్బంది కూడా వాటిలో తమ పిల్లలను చదివించడానికి ఇష్టపడడం లేదు. అంటే ప్రభుత్వ విద్యపై ప్రజలకే కాదు, ప్రభుత్వానికి, అందులో పనిచేసే సిబ్బందికీ కూడా నమ్మకం లేదన్న మాట.   

ప్రభుత్వ విద్యా సంస్థలు ఇంత అస్తవ్యస్తంగా, నాసిరకంగా ఉండి, ఎవరికీ వాటిపై నమ్మకం లేనప్పుడు వాటిని నిర్వహించి ప్రజాధనం వృధా చేయడం ఎందుకు? పూర్తిగా వాటిని ఎత్తివేస్తే, ప్రజాధనం ఆదా అవుతుంది మరియు విద్యార్థులందరికీ ప్రైవేటు స్కూళ్ల చదువు భాగ్యాన్ని కలిగించినట్లు కూడా అవుతుంది.    

0/Post a Comment/Comments

Previous Post Next Post