గ్రామ వలంటీర్లు - ఉద్యోగులా? స్వచ్చంద సేవకులా?

స్థానికంగా గ్రామాల్లో ఉండే నిరుద్యోగులకు ఉపాధి కోసం మరియు ప్రభుత్వ సేవలను గ్రామంలో ప్రతి ఇంటికీ చేర్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వలంటీర్ నియామకాల ప్రక్రియను చేపట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల స్థానంలో వీరు పనిచేయనున్నారు. ప్రతి యాభై కుటుంబాలకో వలంటీర్‌ చొప్పున వీరి నియామకం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 104ను జారీ చేసింది. 50% మహిళలను వలంటీర్లుగా నియమించనున్నారు.      

వలంటీర్  పదం ఎందుకు?

ఇది పూర్తి స్థాయి సమయం కేటాయించవలసిన ఉద్యోగం కాకపోవటం, కనీస వేతన పరిమితి కన్నా తక్కువ వేతనం ఉండడంతో, వారిని ప్రభుత్వం తరపు స్వచ్చంద సేవకులుగా (వాలంటీర్) పరిగణిస్తారు. గ్రామాలలో ఈ మాత్రం ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడంతో, భారీగా దరఖాస్తులు రానున్నాయని అంచనా. 'గుడ్డి కన్నా మెల్ల నయమ'నే భావనతోనే ప్రభుత్వం యొక్క ఇలాంటి చర్యలను కూడా సమర్థించవలసి వస్తుంది. 

జిల్లాలవారీ నోటిఫికేషన్లు 

ఆది (ఇవాళ), సోమ వారాల్లో, జిల్లా కలెక్టర్లు జనాభా ఆధారంగా వలంటీర్ల సంఖ్యను ఖరారు చేసి, నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.

ఎక్కడ దరఖాస్తు చేయాలి. 

ప్రభుత్వం నియామకాల కోసం http://gramavolunteer.ap.gov.in/VVAPP/VV/index.html వెబ్‌సైట్‌ను ఆరంభించింది. ఇవాళ అర్థరాత్రి నుండి అక్కడ దరఖాస్తు చేయవచ్చు. జూన్ 24 నుండి జులై 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

ఎవరు అర్హులు?
  • గ్రామానికి స్థానికులు  
  • ఈ ఏడాది జూన్ 30 నాటికి 18 నుండి 35 ఏళ్ల మధ్యలో వయసు ఉన్నవారు  
  • గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి, ఇతర ప్రాంతాల్లో ఇంటర్ చదివినవారు           
ఎవరు ఎంపిక చేస్తారు ?

తహసీల్దార్‌, ఎంపీడీవో మరియు ఈవోలతో కూడిన భాగస్వామ్య కమిటీ ఎంపికలు నిర్వహించనుంది. ఎవరు ఏ కుటుంబాల పరిధిలో పనిచేయనున్నారో కూడా వారే నిర్ణయిస్తారు. ఎంపికైనవారు ఆగష్టు 15 నుండి విధులలో చేరవలసి ఉంటుంది. 

గౌరవ వేతనం - బడ్జెట్ 

గ్రామ వలంటీర్లకు నెలకు 5,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా వీరిపై 1,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఎంపిక, శిక్షణలకు ప్రాథమికంగా 13.50 కోట్లు ఖర్చవనున్నాయి. 

వార్డు వలంటీర్లు 

పట్టణ ప్రాంతాల్లోని ప్రజల కోసం వార్డు వలంటీర్ల నియామకం జరగనుంది. వార్డు వలంటీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి డిగ్రీ పాసై, స్థానికుడై ఉండాలి. వీరి ఎంపికలు మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్, మెప్మా సభ్యులతో కూడిన కమిటీ చేయనుంది. వీరి కోసం wardvolunteer.ap.gov.in లో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. కాని, ఆ పేజి ఇంకా పనిచేయడం ప్రారంభించలేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post