మోడీ ప్రభుత్వం అవినీతి అధికారులపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కొన్ని రోజుల క్రితం ఇరవై ఏడు మంది ఆదాయపు పన్ను, కస్టమ్స్ శాఖలలో పనిచేస్తున్న ఐఆర్‌ఎస్ అధికారులపై ఈ బలవంత పదవీ విరమణ అస్త్రం ప్రయోగించింది. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దృష్టి సారించింది.
అన్ని ప్రభుత్వ శాఖలలో నెలవారీ సమీక్షలు జరిపి, అవినీతి ఆరోపణలు ఉన్న, ఇతరత్రా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కుంటున్న అధికారుల వివరాలను తమకు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి అధికారులను బలవంతంగా ఇంటికి పంపించే నిబంధన చట్టంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకూ దాన్ని చాలా అరుదుగా ఉపయోగించేవారు. తొలి ఐదు సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా చర్యలు చేపట్టలేదు. కాని, రెండవసారి అధికారం చేపట్టిన తరువాత, పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు కనిపిస్తుంది.
Post a Comment