మిస్‌ ఇండియాగా సుమన్‌ రావు


ఈ ఏడాది ఫెమీనా మిస్ ఇండియాగా రాజస్థాన్‌కు చెందిన సుమన్‌ రావు(20) ఎంపికైంది. రన్నర్-అప్‌గా చత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్‌, సెకండ్ రన్నర్-అప్‌గా తెలంగాణకు చెందిన సంజనా విజ్‌ నిలిచారు. గత సంవత్సరం మిస్ ఇండియాగా ఎంపికైన అనుకీర్తి వాస్‌,  సుమన్‌ రావుకి, 2018 రన్నర్-అప్‌ మీనాక్షీ చౌదరి, శివానికి కిరీటాలను అలంకరించారు. గత సంవత్సరం సెకండ్ రన్నర్-అప్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయారావు, తెలంగాణకు చెందిన సంజనా విజ్‌కు కిరీటాన్ని తొడిగారు.   

ముంబయిలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ ఇండియా పోటీలు జరిగాయి. రెమో డిసౌజా, హ్యుమా ఖురేషీ, దియా మీర్జా, నేహా ధూపియా, చిత్రాంగదా సింగ్‌, సునీల్ ఛెత్రి  తదితరులు ఈ కార్యక్రమానికి నిర్ణేతలుగా వ్యవహరించారు. కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌, నోరా ఫతేహీ, మౌనీరాయ్ ఈ వేడుకలో తమ నృత్యాలతో అలరించారు. థాయిలాండ్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలలో మనదేశం తరపున సుమన్‌ రావు పోటీపడనున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post