గత ఫిబ్రవరిలో పాకిస్తాన్‌కు పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్‌ను అనుకరిస్తూ, ఆ దేశ టీవీ ఛానెల్లో ఒక ప్రకటన (యాడ్) ప్రసారమైంది. దానికి అనవసరమైన ప్రచారాన్ని కల్పిస్తూ మన దేశ మీడియాలో వార్తలు, డిబేట్లు ప్రసారమయ్యాయి. సోషల్ మీడియాలో ప్రజలు కూడా అత్యుత్సాహంతో షేర్లు, రీట్వీట్ల ద్వారా ప్రచారం కల్పిస్తూ, విమర్శించి దానినే జాతీయవాదం అనుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ప్రకటనకు ఇంత విపరీతమైన ప్రచారాన్ని కల్పించడం, జాతీయవాదం ఎలా అవుతుందో ఒక పట్టాన అర్థం చేసుకోలేం.
మన దేశ మీడియాలో ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ దేశానికి ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. పాకిస్తాన్ వ్యతిరేకతను ప్రచారం చేయడమే జాతీయవాదంగా అవి భావిస్తున్నాయి. అసలు ఆ దేశానికి, అక్కడ జరిగే సంఘటనలకు మనం అంత ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరముందా?
వరల్డ్ కప్ క్రికెట్‌ను ప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ కూడా మౌకా - మౌకా పేరు గల ప్రకటన ద్వారా పాకిస్తాన్ వ్యతిరేకతతో కూడిన జాతీయవాదాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది. ప్రజలను రెచ్చగొట్టి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కు మరింతగా హైప్‌ను క్రియేట్ చేసే ఉద్దేశ్యంలోనే ఈ తరహా ప్రకటనలు వెలువడుతున్నాయి.
Post a Comment