ప్రజావేదిక నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ గారు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రజావేదిక నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం, సిఆర్‌డిఎకు అప్పగించింది. ఆ నిర్మాణం, కరకట్టకు, నదికి మధ్యలో వస్తున్నందున కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనుమతిని నిరాకరించారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని లోకాయుక్త ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి మునిసిపల్ శాఖ కూడా అనుమతిని ఇవ్వలేదు.
ఇలా ఎటువంటి అనుమతులూ లేకపోయినా సిఆర్‌డిఎ ఐదుకోట్ల అంచనా వ్యయంతో కాంట్రాక్టరుకు నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించింది. అప్పటి మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో 5కోట్ల అంచనాలను 8.90 కోట్లకు పెంచేశారు. చివరకు రూ.7.59 కోట్ల వ్యయంతో ప్రజావేదిక నిర్మాణం పూర్తయింది. ఇలా ప్రభుత్వాన్ని నడిపేవారే, ఏ స్థాయిలోనూ నిబంధనలను పాటించలేదు.
చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమే
చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమేనని, వీటిని ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Post a Comment