ఒంగోలు కేసులో నిందితుడి ఫేస్‌బుక్ నీతులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఒంగోలు మైనర్ బాలిక రేప్ కేసులో ప్రధాన నిందితుడైన (Accused -1) షేక్ బాజి, ఫేస్‌బుక్ వేదికగా వల్లించిన నీతులపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ బాజి దివ్యాంగుడు కూడా.

హన్మకొండలో జరిగిన తొమ్మిది నెలల శిశువుపై అత్యాచారం మరియు హత్య కేసుపై ఈ బాజి, పరుషమైన వ్యాఖ్యలు చేసాడు. ఇలాంటి వాడిని జైల్లో పోషించకూడదని, చంపేయాలని, మన కుటుంబంలో ఇలాంటిది జరిగితే బాధ ఉండదా అంటూ టైమ్‌లైన్‌లో పోస్టు చేసాడు.  ఒంగోలు కేసులో అరెస్టు అయిన అనంతరం, మరి 'నిన్నేం చేయాలని' ప్రశ్నిస్తున్నారు. ఇక కపట నీతులు మానివేయాలని, ఫేస్‌బుక్  ప్రొఫైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా వెంటనే తీసివేయాలని కూడా కామెంట్లు చేశారు. 

  

0/Post a Comment/Comments

Previous Post Next Post