నారా లోకేష్ భద్రత తగ్గింపు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, మాజీ మంత్రి అయిన లోకేష్ గారికి ఉన్న భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు జడ్ కేటగిరీ కింద 5+5 భద్రత ఉండగా దానిని 2+2కు కుదించారు. చంద్రబాబు గారికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగనుంది. వీరిద్దరికీ కాకుండా, ఆయన మిగిలిన కుటుంబ సభ్యులకు ఉన్న భద్రతా సిబ్బందిని పూర్తిగా తొలగించారు. 

గత అసెంబ్లీ సమావేశాలకు ముందు చంద్రబాబు సెక్యూరిటీలో రెండు వాహనాలను తగ్గించినప్పుడు టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌లో ఆయనకు ఉన్న ఎనిమిది వాహనాలు కొనసాగుతున్నాయి. కాని, ముందు వెళ్లి రూట్ క్లియర్ చేసే పైలట్ వాహనాన్ని, ఎవరూ అనుసరించకుండా కొంత లేటుగా కాన్వాయ్‌ వెంట నడిచే ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించారు. ముందు సమాచారం ఇవ్వకుండా భద్రతను తొలగించారని, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు పట్ల, ఆయన కుటుంబ సభ్యుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post