ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు, తొలిసారి పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు 25 మంది సభ్యులతో కూడిన జాబితాను గవర్నర్ నరసింహన్ గారికి అందజేశారు.
మంత్రివర్గ కూర్పును పరిశీలిస్తే సామాజిక వర్గాల మధ్య సమతుల్యత కోసం ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. తొలిసారి సగానికన్నా ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు లభించాయి. తొలి నుండి కష్ట నష్టాలలో తన వెంట నడిచిన వారికి కూడా ప్రాధాన్యం కల్పించినట్లు కనిపిస్తుంది. ఇదే కారణంతో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్ లకు గత ఎన్నికలలో ఓడిపోయినా మంత్రివర్గంలో స్థానం లభించటం విశేషం.
మంత్రుల జాబితా
- 1.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు - చిత్తూరు జిల్లా)
- 2. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్ - కర్నూలు జిల్లా)
- 3. మేకపాటి గౌతం రెడ్డి (ఆత్మకూరు - నెల్లూరు జిల్లా)
- 4. పుష్ప శ్రీవాణి (కురుపాం - విజయనగరం జిల్లా)
- 5. కొడాలి నాని (గుడివాడ - కృష్ణా జిల్లా)
- 6. నారాయణ స్వామి (గంగాధర -చిత్తూరు జిల్లా)
- 7. చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (ఆచంట - పశ్చిమ గోదావరి జిల్లా)
- 8. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు - ప్రకాశం జిల్లా)
- 9. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ - నెల్లూరు జిల్లా)
- 10. అవంతి శ్రీనివాస్ (భీమిలి - విశాఖపట్టణం జిల్లా)
- 11. అంజాద్ బాషా (కడప - కడప జిల్లా)
- 12. ఆళ్ల నాని (ఏలూరు - పశ్చిమ గోదావరి జిల్లా)
- 13. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి - శ్రీకాకుళం జిల్లా)
- 14. కన్నబాబు (కాకినాడ రూరల్ - తూర్పు గోదావరి జిల్లా)
- 15. ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట - శ్రీకాకుళం జిల్లా)
- 16. పిల్లి సుభాస్ చంద్రబోస్ (మండపేట - పశ్చిమ గోదావరి జిల్లా)
- 17. మేకతోటి సుచరిత (పత్తిపాడు - గుంటూరు జిల్లా)
- 18. పేర్ని నాని (మచిలీపట్నం - కృష్ణా జిల్లా)
- 19. తానేటి వనిత (కోవూరు - పశ్చిమ గోదావరి జిల్లా)
- 20. పినిపే విశ్వరూప్ (అమలాపురం - తూర్పు గోదావరి జిల్లా)
- 21. ఆదిమూలపు సురేశ్ (సంతనూతలపాడు - ప్రకాశం జిల్లా)
- 22 గుమ్మనూరు జయరాం (ఆలూరు - కర్నూలు జిల్లా)
- 23. వెలంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ - కృష్ణా జిల్లా)
- 24. మోపిదేవి వెంకటరమణ (రేపల్లె - గుంటూరు జిల్లా)
- 25. శంకర్ నారాయణ (పెనుగొండ - అనంతపురం జిల్లా)
Post a Comment