హమ్మయ్య, మా స్థానాలు సేఫ్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ జాబితా బయటకు రాగానే, ఆ జాబితాలో ఉన్న వారు సంతోషించగా, రాష్ట్ర శాసన మండలి సభ్యులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.   

తనకు శాసన మండలిలో బలం లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు, దాని రద్దుకు సిఫార్సు చేయనున్నారనే వార్తలు, గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఇప్పుడు గత ఎన్నికలలో ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు మంత్రి పదవులు లభించడంతో వారు  శాసన మండలికి ఎన్నిక కానున్నారని తేలిపోయింది. దీనితో శాసన మండలి రద్దు వార్తలు ఊహాగానాలేనని, తమ స్థానాలు సురక్షితమేనని సభ్యులకు భరోసా ఏర్పడింది.

అంతేకాక, తెలుగుదేశం పార్టీకి మెజారిటీ స్థానాలున్న మండలిలో ప్రభుత్వం బిల్లులను ఎలా నెగ్గించుకుంటుందన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.      

0/Post a Comment/Comments

Previous Post Next Post