ఇకపై చిప్‌తో కూడిన అత్యాధునిక ఈ-పాస్‌పోర్ట్‌లు

త్వరలో చిప్‌తో కూడిన అత్యాధునిక ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నామని, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు తెలియజేశారు. సోమవారం రోజు ఆయన ఏడవ పాస్‌పోర్ట్ సేవా దివస్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమీప భవిష్యత్తులో ప్రజలందరూ చిప్‌తో కూడిన, అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన కొత్త పాస్‌పోర్ట్ బుక్‌లెట్‌లను పొందనున్నారని జయశంకర్ అన్నారు. పాస్‌పోర్ట్‌లను జారీ చేసే విధానంలోనూ మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నామని, వాటిని పొందటానికి పట్టే మరింత తగ్గిపోనుందని, అదే సమయంలో దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని కూడా ఆయన తెలిపారు. 

0/Post a Comment/Comments