బందరు పోర్టు - లోకేష్ - కెసిఆర్, జగన్

లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా బందరు పోర్టును గురించి వ్యాఖ్యానించినప్పుడు, సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలలో కొంత వాస్తవం ఉంది.   

ప్రచారంలో భాగంగా మార్చి24న లోకేష్ ఏం అన్నారంటే..   
"మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకుపోయేందుకు, ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది." 

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఓడరేవులు లేనందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఓడరేవు నుండి వారికి ఎగుమతి/ దిగుమతి అవకాశాలు కల్పించాలని సూచించారు. తెలంగాణకు అతి తక్కువ దూరంలో ఉన్న బందరు పోర్టును ఆ రాష్ట్రం ఎంచుకుంది. పోర్టును అభివృద్ధి చేసి వాడుకుంటామని ఆ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌ని కోరింది. కాని, ఆ రాష్ట్రంతో ఉన్న విభేదాల వలనో, లేక ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే అదనంగా దండుకోవచ్చనో "నవయుగ" సంస్థకు అప్పగించారు.

ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసినా, నవయుగ సంస్థ చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నులను, ఇతరత్రా రుసుములను చెల్లించవలసిందే. నవయుగతో అయితే లాలూచీ పడవచ్చు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అది సాధ్యం కాదుగా! 

ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారితో, విజయవాడలో సమావేశమైన కెసిఆర్ గారు, తమ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఓడరేవులలో ఎగుమతి, దిగుమతి అవకాశాలు కల్పించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. బందరు పోర్టును ఇప్పటికే నవయుగకు అప్పగించినందున, మరేదైనా ఇతర పోర్టును అప్పగిస్తారో, లేక అక్కడే కొన్ని బెర్తులను కేటాయిస్తారో వేచిచూడాలి. 

0/Post a Comment/Comments