రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు. దీని సాధనకు రాష్ట్రాల సహకారం కీలకమని, ఎగుమతులను ప్రోత్సహించడంపై, అవి దృష్టి సారించాలని సూచించారు. ఎగుమతులవల్ల ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. నీటివనరుల సమర్థ వినియోగానికి జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశామని కూడా తెలిపారు.
మన ఆర్థిక వ్యవస్థ 2018 సంవత్సరానికి, 2.7 ట్రిలియన్ డాలర్లు. మన దేశ జిడిపి వృద్ధి రేటు కష్టంగా ఏడుశాతంగా ఉంది. ప్రత్యేకించి 'కష్టంగా' అని ఎందుకు అనవలసి వస్తుందంటే అనేక మంది ఆర్ధిక నిపుణులు వృద్ధిరేటును లెక్కగట్టే విధానంపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా, రెండు శాతం వరకు పెంచి చూపిస్తున్నారన్న విమర్శలు కూడా చేశారు. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే ఈ వృద్ధిరేటు సరిపోదు. ఇప్పుడున్నదానికి రెండింతల వృద్ధిరేటుతో దూసుకుపోవాలి.
దేశంలో నిరుద్యోగ రేటు మరియు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడం లాంటి ప్రతికూల సంకేతాలున్న నేపథ్యంలో ఇప్పుడున్న వృద్ధిరేటును నిలబెట్టుకోవడమే కష్టమని అంచనాలున్నాయి. వృద్ధిరేటు రెండంకెలకు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి.
Post a Comment