విశ్వవేదికపై మరో విజయం

- వరల్డ్ ఆఫ్ డాన్స్ కాంపిటీషన్ విజేత ముంబయికి చెందిన కింగ్స్ యునైటెడ్ 
- ఫైనల్లో తెలుగుపాట 

టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావంతో మనదేశంలో హాలీవుడ్ సినిమాలను, టీవీ షోలను చూడటం ఎక్కువైంది. ఇటీవలే విడుదలైన ఎవెంజర్స్ ఎండ్ గేమ్ దీనికి ఉదాహరణ. అలాగే బాలీవుడ్ తరహా సంగీతానికి, నృత్య రీతులకు విదేశాలలో ఆదరణ లభిస్తుంది. అక్కడి తరహాలో మనదేశంలోకూడా దశాబ్ద కాలం నుండి రియాలిటీ షోలకు, ముఖ్యంగా డ్యాన్స్ షోలకు ప్రోత్సాహం, ఆదరణ పెరిగింది.

NBC ఛానెల్ సమర్పిస్తున్న వరల్డ్ ఆఫ్ డాన్స్ షోకి అమెరికాలో విస్తృత ఆదరణ ఉంది. ఈ కాంపిటీషన్లో దాదాపు అన్ని దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ఈ సంవత్సరం వారు నిర్వహించిన మూడవ సీజన్లో ఆసియా దేశాలకు చెందిన జట్లు ఎక్కువ ప్రతిభ కనబర్చాయి. దానితో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించారు.

మనదేశం తరపున ముంబయికి చెందిన కింగ్స్ యునైటెడ్ జట్టు వరల్డ్ ఆఫ్ డాన్స్ సీజన్ - 3 లో పాల్గొంది. అయితే ఆరంభం నుండి విశేషమైన ప్రతిభతో ఫేవరేట్ గా పేరు తెచ్చుకుంది. ఈ రోజు జరిగిన ఫైనల్లో కూడా ప్రత్యర్థులకు అందనంత స్కోరుతో విజేతగా నిలిచింది. వారు స్పార్టన్ థీమ్ తో దేవిశ్రీ ఆడెవడన్న పాటను పెర్ఫార్మ్ చేయటం విశేషం. ఈ షోకు జడ్జ్ లుగా జెన్నిఫర్ లోపెజ్, నే-యో మరియు డెరెక్ లు వ్యవహరించారు.

కింగ్స్ యునైటెడ్ ఈ షోలో ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభను మనం ఇక్కడ చూడవచ్చు.











ఎందువల్లనో ఈ షో మన దేశ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఆకర్షించలేకపోయింది. ఈ షో ద్వారా కింగ్స్ యునైటెడ్ జట్టు మిలియన్ డాలర్ల నగదు, బాలీవుడ్ ప్రముఖుల, నెటిజన్ల ప్రశంసలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post