జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోటీచేసి మొత్తం దేశంలో పోలైన ఓట్లలో ఆరు శాతం/ సీట్లలో రెండు శాతం సాధించాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీగా గుర్తింపును పొంది ఉండాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కరీంనగర్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ అవసరమైతే ఎన్నికల తరువాత జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలా చేయాలంటే దేశవ్యాప్తంగా జరురుగుతున్న ఎన్నికలకు ముందే సన్నద్ధమై ఉండాలి లేదా తరువాత వివిధ రాష్ట్రాలలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఆధారపడాలి. కానీ వేరే రాష్ట్రాలలో పోటీ చేసే బలంగానీ, ఉద్దేశ్యంగానీ తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నట్లు కనిపించదు. ఆ పార్టీకి ఉన్న పేరు కూడా కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అన్న భావనను కలిగిస్తుంది. బహుశా కెసిఆర్ గారు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తామనే భావనలో జాతీయ పార్టీ అని ప్రస్తావించి ఉండవచ్చు.
Post a Comment