రాజకీయ పార్టీల అతితెలివి

ఎన్నికలలో గెలుపొందటానికి దేశంలోని అన్ని రాజకీయపార్టీలు ఓటర్లను యథాశక్తి ప్రలోభాలకు గురిచేయటమే కాకుండా, గెలవడానికి వీలైన అన్ని అక్రమ మార్గాలను అనుసరించాయి. పోలింగ్ రోజున బూత్ స్థాయి మానేజ్‌మెంట్ విషయంలో అవి చూపిన క్రియేటివిటికి ఆశ్చర్యం కలగక మానదు. 

ఉత్తర ప్రదేశ్‌లో తమకు ఎలాగూ ఓటు వేయని ఒక వర్గం వారిని ఓటింగ్ కు రాకుండా చేసేందుకు ఒక జాతీయ పార్టీ డబ్బులు పంచినట్లుగా వార్తలు వచ్చాయి. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకుండా ఉండేందుకు ముందుగానే వారి వేళ్ళకు సిరా గుర్తులను పెట్టడం చేసారట. 

ఇక తమకు ఓటు వేస్తారనుకున్న వారు ఓటు వేశారని నిర్ధారించుకోవటానికి ముందుగా బూత్ లోనికి వెళ్ళినవారు ఈవీఎంలో తమ పార్టీ గుర్తుపైన ప్రత్యేకమైన సిరాను అద్ధి, తర్వాత ఓటు వేసి వచ్చిన వారి చూపుడు వేలికి సిరా మరక ఉందో, లేదో చూసి మరీ డబ్బులిచ్చారట. 

0/Post a Comment/Comments

Previous Post Next Post