టిఆర్ఎస్‌ను ముంచిన వారసులు

వారసులకు సీట్లు కేటాయించిన సికింద్రాబాద్, నిజామాబాద్ మరియు మల్కాజిగిరి నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి పాలయింది. ఈ మూడు ప్రాంతాలలో ఎదురైన పరాభవాలకు వివిధరకాలైన కారణాలున్నాయి. 

తలసాని శ్రీనివాస యాదవ్ ఎలాగైనా గెలిపిస్తాననే హామీ ఇవ్వడంతో సికింద్రాబాద్ నియోజకవర్గ టికెట్‌ను తలసాని సాయికిరణ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థి వ్యవహార శైలి అసలు బాగాలేదని, కిషన్ రెడ్డితో అసలు పోటీపడలేరనే విమర్శలు బాహాటంగానే వినిపించాయి.

మల్కాజిగిరి నియోజక వర్గంలో మంత్రి మల్లారెడ్డి హామీతో టికెట్ పొందిన అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి భారీగా ఖర్చుపెట్టినప్పటికీ, మంత్రిపై ఉన్న వ్యతిరేకత, ద్వితీయశ్రేణి నాయకులను కలుపుకొని వెళ్ళకపోవడం, పార్టీ టికెట్‌ను అమ్ముకుందని ప్రచారం జరగటం వంటివి దెబ్బతీసాయి. 

ఇక ముఖ్యమంత్రి తనయ కవిత, స్వయంగా బరిలో ఉన్న నిజామాబాద్ నియోజకవర్గంలో రైతులలో ఉన్న అసంతృప్తి, కెసిఆర్ నియంతృత్వ ధోరణులపై పెరుగుతున్న వ్యతిరేకత, డి. శ్రీనివాస్ పై ఉన్న సానుభూతి ఆమె ప్రత్యర్థి అరవింద్ కు కలసి వచ్చాయి.  

0/Post a Comment/Comments

Previous Post Next Post