నేషనల్ జియోగ్రఫిక్ బీ కిరీటం ఇండియన్ అమెరికన్‌దే

నేషనల్ జియోగ్రఫిక్ బీ పోటీలలో ఇండియన్ అమెరికన్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ వాషింగ్టన్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో తొలి మూడు స్థానాలలో వీరే నిలవటం విశేషం. నిహార్ జంగా విజేతగా నిలువగా, మల్లన్న ఆత్రేయ మరియు రిషి కుమార్ రెండు, మూడు స్థానాలు సాధించారు. 

విజేతకు $25000 స్కాలర్‌షిప్ తో పాటు జియోగ్రఫిక్ సొసైటీలో జీవితకాల మెంబర్‌షిప్ మరియు ఉచిత ట్రిప్ లభించనున్నాయి. నిహార్ జంగా టెక్సాస్ మిడిల్ స్కూల్లో 8th గ్రేడ్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి 2016లో స్పెల్లింగ్ బీ విజేతగా కూడా నిలవడం గమనార్హం. రన్నర్-అప్ కు $10000, మూడవ స్థానంలో నిలిచినవారికి $5000, 10వ స్థానం వరకు నిలిచిన మిగిలినవారికి $1000 లభించనున్నాయి. ఈ సారి సెమీఫైనల్ కు చేరిన పది మందిలో తొమ్మిదిమంది ఇండియన్ అమెరికన్లే.    

1988లోప్రారంభమైన ఈ నేషనల్ జియోగ్రఫిక్ బీ పోటీలలో భారత సంతతికి చెందిన వ్యక్తి ఛాంపియన్ గా నిలవటం ఇది వరుసగా ఎనిమిదవసారి. నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో కూడా వీరే  వరుస విజయాలు సాధిస్తున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్లో ప్రత్యక్ష్య ప్రసారం అయిన ఈ పోటీని ఇక్కడ వీక్షించవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post