ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 12.23 గంటలకు వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, జగన్ చేత ప్రమాణం చేయించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్‌ల సమక్షంలో ఆయన ఈ ప్రమాణాన్ని తెలుగు భాషలో, దైవసాక్షిగా ఆచరించారు.
జగన్ కుటుంబ సభ్యులు మరియు అన్ని జిల్లాల నుండి వైసిపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన అభిమానులు, సాధారణ ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. స్టేడియంలోపలికి రాలేకపోయిన అభిమానుల కోసం బయట 14 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక కాన్వాయ్‌లో స్టేడియానికి చేరుకున్న జగన్‌పై వైసిపి నేతలు హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జగన్, కెసిఆర్, స్టాలిన్‌లు ప్రసంగించారు.షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అనుమతులు రద్దు చేయడంతో ఢిల్లీలో జరగనున్న నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎంలు కేసీఆర్, జగన్‌లు హాజరు కాలేకపోతున్నట్లు కూడా వారు తెలియజేసారు.
Post a Comment