సెబాస్టియన్ కుర్జ్ |
ఒక కీలకమైన వీడియో లీకైన తరువాత జరిగిన సంఘటనలు ఒక దేశ ప్రభుత్వాన్నే కూల్చేసాయి. ఈ విచిత్రం ఆస్ట్రియాలో జరిగింది.
ఇవాళ ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్, అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో సెబాస్టియన్ కుర్జ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసారు. 2017లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన వీడియోను జర్మన్ మీడియా పబ్లిష్ చేయడంతో ఈ పరిణామాలు సంభవించాయి.
ప్రస్తుతం ఆస్ట్రియాకు వైస్ చాన్సలర్‌గా ఉన్న హెనిజ్ క్రిస్టియన్ స్టార్క్, తమ పార్టీకే చెందిన కీలక నేత జొహన్నా గుడ్‌నెస్‌తో కలిసి ఎన్నికలకు ముందు రష్యన్ మహిళతో కలిసి మద్యం సేవిస్తూ ఎన్నికలలో తమ విజయానికి దోహదం చేస్తే ప్రభుత్వంలోని కీలక రహస్యాలు అందచేస్తామని ఒప్పదం కుదుర్చుకున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. స్పెయిన్ దీవి ఇబిసాలో లో 2017లో ఈ ఒప్పందం జరిగింది.
ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే ఆస్ట్రియన్ చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్, క్రిస్టియన్ స్టార్క్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసారు. దానితో క్రిస్టియన్ స్టార్క్‌కు మద్ధతునిచ్చే కొందరు మంత్రులు కూడా రాజీనామా చేసారు. దానితో మైనారిటీలో పడిన కుర్జ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాయి. దీనిలో ఆయన ఓటమి పాలయ్యారు.
Post a Comment