గెలిస్తే మా ఘనతే...ఓడితే మీ వల్లే...

తెలుగుదేశం పార్టీ ఎన్నికల విశ్లేషణలు విచిత్రంగా ఉంటాయి. ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయడం వల్లనే 32 అసెంబ్లీ స్థానాలు మరియు 8 పార్లమెంట్ స్థానాలలో వారు ఓడిపోయారట. జనసేన పార్టీకి వచ్చిన ఓట్లను, వైసిపి మెజారిటీతో సరిపోల్చుకుని వారు ఈ విశ్లేషణలు చేస్తున్నారు. అసలు జనసేన పార్టీ పోటీ చేయకపొతే వారికి పడిన ఓట్లన్నీ తమకే పడతాయని వారు ఊహించేసుకున్నారు. అంటే జనసేన ఓట్లకు వీరే పూర్తి హక్కుదారులయినట్లు, వీరిని గెలిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు ఉన్నట్లు వీరి ధోరణి ఉంది.

2014 ఎన్నికలలో జనసేన సహకారంతో  విజయం సాధించినప్పుడు, విజయం కేవలం తమ పార్టీ ఘనతేనని, దానిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ లేదని అనేకమార్లు ప్రసంగాలలో, చర్చలలో టిడిపి నాయకులు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో ఓటమి పాలయితే మాత్రం అది జనసేన పోటీ చేయడం వలననే తాము ఓడిపోయినట్టు  ప్రచారం చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్‌ను దూరం చేసుకోవడం టిడిపి చేసిన వ్యూహాత్మక తప్పిదం. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తాడనే అంచనాతోనే వారు కావాలని ఆయనను దూరం చేసుకున్నారు.  

ఎన్నికల అనంతరం తమ విధానాలలో లోటుపాట్లని కాకుండా, వేరే వాళ్ళని తమ ఓటమికి బాధ్యులను చేయడం తెలుగుదేశం పార్టీకి ముందునుండి ఉన్న అలవాటు. లోక్ సత్తా పార్టీ, ప్రజా రాజ్యం పార్టీలపైన కూడా వారు ఈ తరహా ప్రచారం జరిపారు. ఈ దఫా కూడా ఈవీఎంలపైన నెపం వేయడానికి కూడా ముందే సన్నద్ధం అయ్యారు. కానీ ఎందుకో మరి, దానిని వదిలి ఇప్పుడు పవన్ పైన దృష్టినిలిపారు.       

అసలు టిడిపి వలననే జనసేనకు భారీ నష్టం జరిగింది. 2014 ఎన్నికలలో వారికి మద్ధతునివ్వడం, 2019లో జనసేన వారి మిత్రపక్షమే అని ప్రచారం జరగడం వంటి కారణాల వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన సాధించలేకపోయింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post