ప్రత్యేక హోదాపై జగన్ యు-టర్న్ తీసుకున్నారా?

జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ముందే మోడీ ముందు మోకరిల్లారని, ప్రత్యేక హోదాపై యు-టర్న్ తీసుకున్నారని టీవీ చర్చలలోనూ, సోషల్ మీడియాలోనూ అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు గారు కూడా మోడీతో సామరస్యంగా వెళితే, ఎన్డీఏ నుండి బయటకు రావాలని, ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేసారని, ఇప్పుడు అధికారం లోకి రాగానే పోరాటం చేయడం లేదని, ఈ విషయంలో ఇద్దరి విధానాల్లో పెద్దగా తేడా లేదని వారి వాదన.  

జగన్ గారు మోడీని ఎన్నిసార్లు కలిస్తే అన్నిసార్లు ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేస్తూనే ఉంటాను అన్నారు. చంద్రబాబు గారు 'హోదా కన్నా ప్యాకేజీ బావుంటుంది' అని  అనటమే కాకుండా, ప్యాకేజీని సమర్థిస్తూ అసెంబ్లీ తీర్మానం కూడా చేసారు. ఇలా ఇద్దరి విధానాలలో స్పష్టమైన తేడా ఉంది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం, రాజీనామాలు చేయడం వంటి పోరాట పంథాను అనుసరించినా హోదా వచ్చే అవకాశం ఉండకపోవడంతో, జగన్ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారని భావించవచ్చు.         

0/Post a Comment/Comments

Previous Post Next Post