పాపం... వారి ప్రచారం సరిపోలేదట.

సాధారణంగా ఎన్నికలలో ఓటమి పాలైన పార్టీలు తమ విధానాలలో లోపాలెక్కడున్నాయో సమీక్షించుకుంటాయి. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఓటమికి ప్రచార యావ, చేసుకున్నదానికన్నా ఎక్కువ చెప్పుకోవటం కూడా ఒక కారణమేనని ఎవరైనా విశ్లేషించగలరు. కానీ ఈనాడులో వచ్చిన వార్తను బట్టి ఆ పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు గారి మరియు పార్టీ శ్రేణుల వైఖరి దీనికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

ఆ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో జరుపుతున్న సమావేశాలలో  తాము నిరంతరం కష్టపడ్డామని, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసామని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసామని అయినా ఓటమి పాలయ్యామని ఆవేదన చెందుతున్నారట. నెల్లూరు జిల్లా నేతలను కలిసినప్పుడు వారు మనం ఎంతో అభివృద్ధి జరిపినా, తగిన విధంగా  ప్రచారం చేసుకోలేకపోయినందునే ఓటమి పాలయ్యామని సమీక్షించారట.   

0/Post a Comment/Comments

Previous Post Next Post