తెలుగు దేశం పార్టీ నుండి గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మరియు కేశినేని నానిలు మాత్రమే మళ్లీ ఎంపీలుగా గెలుపొందారు. ఈ గెలిచిన ముగ్గురూ ఎదో ఒక సందర్భంలో పార్లమెంటులో ప్రత్యేక హోదాపైన ప్రసంగించటం విశేషం. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రత్యేక హోదాకు కృషి చేసిన వారికి ఆంధ్ర ఓటర్లు అన్యాయం చేయరు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఎంపీలు గెలిచిన స్థానాలలో ఎక్కువ మంది వైసిపి ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ, వీరికి అనుకూలంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అయితే ఇది పూర్తిగా ప్రత్యేక హోదాపైన ప్రసంగించటం వలన వచ్చిన అనుకూలతే అని చెప్పలేము. కానీ, అది కూడా కొంత కారణమై ఉండవచ్చు. వీరిపై ఎక్కువ వ్యతిరేకత లేకపోవటం, ఈ స్థానాలలో జనసేన ప్రభావం ఎక్కువగా కనిపించకపోవడం వలననే వీరు తక్కువ మెజారిటీతో బయటపడ్డారు.
Post a Comment