కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కిషన్ రెడ్డి గారు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అనేది అందరికీ సంతోషకరమైన విషయమే. కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి హిందీ భాషను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలుగచేసింది.
హిందీ భాషకు ప్రాధాన్యతను ఇచ్చే బిజెపి పార్టీనుండి గెలుపొందినందుకో, లేక మోడీ గారిని ఆనంద పరిచేందుకో ఆయన ఆ భాషను ఎంచుకుని ఉండవచ్చు. కానీ హిందీ భాషలో పెద్దగా చదవటం అలవాటు లేని ఆయన ప్రమాణ స్వీకార సమయంలో రెండు, మూడు సార్లు తడబడటంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు పదాలను అందించవలసి వచ్చింది. దీనికి బదులు ఆయన తెలుగు భాషలో సాధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తే బావుండేది. అలా కాదనుకున్నప్పుడు చదవడం అలవాటున్న ఇంగ్లీషు భాషను ఎంచుకోవాల్సింది.
ఈ కార్యక్రమం అనంతరం కిషన్ రెడ్డి గారు, మీడియాతో మాట్లాడుతూ "తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తానని" చెప్పడం కొసమెరుపు.
Post a Comment