ఈ సారి స్పెల్లింగ్ బీలో ఎనిమిది మంది చాంపియన్లు

ఉత్కంఠభరితంగా 20 రౌండ్ల పాటు జరిగిన స్పెల్లింగ్ బీ ఛాంపియన్ షిప్, ఎనిమిది మంది ఫైనలిస్టుల మధ్య టై గా ముగిసింది. వారందరూ తమకు ఇచ్చిన 47 పదాలన్నింటినీ కచ్చితంగా స్పెల్ చేయగలిగారు. దీనితో ఎనిమిది మందిని విజేతలుగా ప్రకటించి  ప్రతి ఒక్కరికీ 50వేల డాలర్ల బహుమతిని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు తెలియ చేసారు. స్పెల్లింగ్ బీ చరిత్రలో ఇలా ఇంతమందిని చాంపియన్లుగా ప్రకటించడం తొలిసారి.  

ఈ సారి కూడా స్పెల్లింగ్ బీలో ఇండియన్ అమెరికన్ల ఆధిపత్యం కొనసాగింది. విజేతలుగా నిలిచిన ఎనిమిది మందిలో ఏడుగురు వారే. విజేతల పేర్లు రిషిక్ గంధశ్రీ, ఎరిన్ హోవార్డ్, సాకేత్ సుందర్, శృతిక పాదే, సోహుమ్ సుఖాతాంకర్, అభిజాయ్ కొడాలి, క్రిష్టోఫర్ సెర్రావు మరియు రోహన్ రాజా.  50 రాష్ట్రాల నుండి 562 మంది ఫైనల్స్ కు చేరగా ఈ ఎనిమిది మంది విజేతలుగా నిలిచారు.       

0/Post a Comment/Comments

Previous Post Next Post