తెలంగాణ ప్రజలు మీడియా విశ్లేషణలను పట్టించుకోవటంలేదా?

ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రజలను తెలుగు మీడియా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతుందనే విషయం అవగతమవుతుంది. వీటి అంచనాలు, విశ్లేషణలు గురి తప్పగా, జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్, విశ్లేషణలు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి.   

గత  కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి గణనీయమైన ఫలితాలు సాధించనుందనే విశ్లేషణలు కనిపించాయి. ప్రసారం చేసిన వార్తలు అన్నీ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా చివరిలో లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా ఇలాంటి టిడిపి తరహా ఎత్తుగడలకు పరాకాష్ఠగా నిలిచింది. వీటికితోడు ఎన్నికల తరువాత కూడా హంగ్ ఏర్పడనుందని కూడా మీడియా సంస్థలే తేల్చి చెప్పాయి. ఇవన్నీ ఒక విధంగా తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసేందుకనే విషయం స్పష్టం అవుతుంది. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు మీడియా సంస్థల పాత్ర వలన ఇవన్నీ దాదాపుగా ప్రజల విశ్వాసం కోల్పోయాయి. దానితో వారు తమ భావాలను పంచుకోవటానికి కూడా సంకోచిస్తున్నారు. జాతీయ మీడియాతో ఇక్కడి ప్రజలకు ఆ సమస్య లేనందువలన వాటి విశ్లేషణలు అంచనాలను అందుకున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post