రాష్ట్రమంతటా విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ మొత్తం పది అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్ పార్టీ ఆరు, టిడిపి రెండు, స్వతంత్య్ర అభ్యర్థికి ఒక స్థానం లభించాయి. టిఆర్ఎస్ కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు 2014లో గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెంలో కూడా పార్టీ ఓడిపోయింది. ఒక్క ఖమ్మం నియోజక వర్గం నుండి మాత్రం పువ్వాడ అజయ్ విజయం సాధించారు.
తెలంగాణలోని మిగతా ప్రాంతాలలో పోలిస్తే ఖమ్మం జిల్లా పరిస్థితి కొంతవరకు భిన్నమైనది. ఇక్కడ తెలంగాణ ఉద్యమ ప్రభావం తక్కువ. ప్రజా కూటమిలోని పార్టీల పొత్తును జిల్లా ప్రజలు ఆమోదించారు. కాంగ్రెస్, సిపిఐ టిడిపిల ఓట్లు ఒక పార్టీనుండి మరో పార్టీకి బదిలీ అయ్యాయి. టిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత పోరు కూడా కలిసి రావటంతో, రాష్ట్రమంతటా ఎదురు గాలులు వీచినా ఖమ్మంలో మాత్రం పదింట ఎనిమిది నియోజకవర్గాలను కూటమి గెలవగలిగింది.
Post a Comment