ఏడు ఉత్తరాఖంఢ్ జిల్లాలలో నిషేధింపబడిన కేదారనాథ్ సినిమా ఎవరైనా చూసారా? ఇది బిజెపి, ఆర్ఎస్ఎస్ శ్రేణులు తరచుగా విమర్శించే 'లవ్ జిహాద్' ను సమర్థిస్తున్నట్లు కనిపిస్తుంది. బాలీవుడ్ ఇప్పటికే అనేక కోణాలలో హిందూ వ్యతిరేకమనే భావనను కలిగి ఉన్న సమయంలో ఈ సినిమా రావటం మూలిగే నక్కపై తాటిపండు పడటంలా ఉంది.
ఖాన్‌ల ఆధిపత్యం, దుబాయ్ మాఫియా పెట్టుబడులు లాంటి ఆరోపణలతో సతమతమవుతూ, సాంకేతికంగా మరియు కథలు, కథనాల విషయంలో దక్షిణాది సినిమాలతో పోటీపడలేకపోతున్న బాలీవుడ్ ఇలాంటి సినిమాలతో వీక్షకుల దృష్టిలో పలుచనవుతూ ఉంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన కేదారనాథ్ వరదలను కూడా వదలకుండా తమ స్వప్రయోజనాలకు, హిందూ వ్యతిరేక చర్యలకు వాడుకోవడం గర్హణీయం. ఈ సినిమాలో ముస్లిం అబ్బాయిని పర్యావరణ ప్రేమికుడిగా, హిందువులను, కేదారనాథ్ యాత్రికులను ప్రకృతికి నష్టం కలిగించేవారిగా చూపించిన విధానం ఏ మాత్రం బాగాలేదు. ముస్లిం అబ్బాయితో ప్రేమను, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వలననే కేదారనాథ్ వరదలు వచ్చినట్లు చూపించటం హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉంది.
దక్షిణాది సినిమాలలో హిందూ మతాన్ని ఆచరిస్తూనే, ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. ఈ మధ్య వచ్చిన బాలీవుడ్ సినిమా ముల్క్ లో కూడా హిందుత్వాన్ని ఆచరించేవారిని దుర్మార్గంగా, అనవసరంగా ఇతరులను హింసించేవారిగా చూపించారు. ఈ రకమైన సినిమాల వలన బాలీవుడ్ పరిశ్రమకు నష్టం తప్ప ఏమాత్రం లాభం లేదు. పైగా ప్రతీసారి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొనవలసి వస్తోంది.
Post a Comment