ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్ 4 ట్రైలర్ విడుదలైంది. అనేక మంది సెలబ్రిటీలు కూడా దీని కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పటికే ఆలస్యమైన ఈ ట్రైలర్ 5న రావలసి ఉండగా అమెరికా మాజీ అధ్యక్ష్యుడైన సీనియర్ బుష్ మరణంతో మరో రెండు రోజుల పాటు వాయిదా పడింది. గత భాగాలలో కొంతమంది సూపర్ హీరోస్ థానోస్ చేతిలో అంతమవటంతో ఈ భాగంలో ఏం జరుగుతుందో అన్న కుతూహలం ఈ సినిమా మీద అంచనాలను పెంచేసింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.
Post a Comment