చంద్రబాబు ఎన్నికల ప్రసంగాలలో ఒకప్పటి స్పష్టత ఏది?

చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రసంగాలు సూటిగా స్పష్టంగా ఉండేవి. ఇంటర్వ్యూలలో ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలిగే సంసిద్ధత కనిపించేది. ఇప్పుడు ఆయన మాటలలో ఒకప్పటి సాధికారికత లేదు. దానిస్థానంలో తడబాటు, అయోమయం మరియు ఇంటర్వ్యూల్లో ప్రశ్నలకు నీళ్లు నమలడం లాంటివి చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఆయన ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రసంగాలు చేసారు. వీటిలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఆంగ్ల  జాతీయ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో నయితే, అనేక ప్రశ్నలకు "What I Am Saying" అంటూ నీళ్లు నమిలారు.  

తెలంగాణ ప్రచారంలో ఆయన ఎక్కువగా నష్ట నివారణ కోసమే ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. తాను తెలంగాణ ఏర్పాటుకు సహకరించానని చెప్పటం, ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోలేదని చెప్పడం కనిపించాయి. తనే నాలుగేళ్ల పాటు మోడీ ప్రభుత్వంలో భాగస్వామి అయిఉండి కూడా కెసిఆర్ గారిని చోటా మోడీ అంటూ విమర్శించడం, మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు కెసిఆర్ కారణమని చెప్పడం మరో విచిత్రం. మొదట హైదరాబాద్ కట్టానని చెప్పి విమర్శలు రావటంతో సైబరాబాద్ పల్లవిని అందుకున్నారు.   

చంద్రబాబు ప్రసంగాలలో కెసిఆర్ హామీలు నెరవేర్చలేదని ఆరోపించడం అయితే ఆయన ద్వంద్వ వైఖరికి పరాకాష్ఠ. ఇంకా గురువింద తరహాలో కెసిఆర్‌వి కుటుంబ రాజకీయాలంటూ ప్రస్తావించటం, మొన్నటి వరకూ తిట్టిన కాంగ్రెస్, సోనియాల పంచనే చేరటం ఆయనలోని భయాన్ని, అభద్రతాభావాన్ని సూచిస్తున్నాయి. ఆయనను గమనిస్తే ఈ తడబాటు ధోరణి తెలంగాణ ఉద్యమంలో రెండు కళ్ళ సిద్ధాంతం ఆరోపణలు వచ్చిన తరువాత నుండి మొదలైనట్లు కనిపిస్తుంది. నోటుకు ఓటు కేసు తరువాత మరింత గందరగోళంలో పడిపోయారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post