బాబోయ్... ఇవేం మెజారిటీలు

ఎన్నికల సమరంలో టిఆర్ఎస్ పార్టీ ఓట్ల సునామీని సృష్టించింది. పోలైన ఓట్లలో 46.9%తో, కోటి ఓట్లకు చేరువలో నిలిచింది. విజయం సాధించిన వారిలో హరీష్ రావుకు ఏకంగా లక్షా పద్దెనిమిది వేల మెజారిటీ వచ్చింది. ఈయనతో పాటు మరో పద్నాలుగు మంది టిఆర్ఎస్ అభ్యర్థులకు కూడా యాభయి వేలకు పైగా ఆధిక్యత లభించింది. వీరిలో ఆరూరి రమేష్ (వర్ధన్నపేట - 99,240), కెటిఆర్ (సిరిసిల్ల - 89,009), మల్లారెడ్డి (మేడ్చల్ - 87,990), కెసిఆర్, మైనంపల్లి లాంటి వారు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు ఎంఐఎం అభ్యర్థులు కూడా 50వేలకు పైగా మెజారిటీ సాధించారు. 

సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలలో 50వేలకు పైగా మెజారిటీ అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఇంతమంది అభ్యర్థులు ఈ స్థాయి మెజారిటీ సాధించటం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ జరగలేదు. కెసిఆర్ ఎన్నికల వ్యూహాలు, సంక్షేమపథకాలు మరియు  ప్రతిపక్షాల అనైతిక పొత్తు ఈ స్థాయి మెజారిటీలు సాధించటానికి దోహదపడ్డాయి.              

0/Post a Comment/Comments

Previous Post Next Post