గజ్వేల్‌లో విజయం సాధించటంతో కెసిఆర్ ఎనిమిదవసారి ఎంఎల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఐదు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. తెలంగాణ కోసం తరచుగా రాజీనామా చేసి గెలుపొందడంతో స్వల్ప కాలంలోనే ఆయన ఈ ఘనత సాధించారు. ఇంతకు ముందు బాగారెడ్డి గారికి ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన రికార్డు ఉంది. ఎనిమిది సార్లతో కెసిఆర్ ఇప్పుడు దీనిని అధిగమించారు. జానా రెడ్డి గారు కూడా ఇప్పటికే ఏడు సార్లు ఎన్నికయినప్పటికీ ఈసారి ఓటమి పాలయ్యారు.
హరీష్ రావు గారు సిద్ధిపేట నియోజకవర్గం నుండి ఆరవ సారి ఎంఎల్యేగా గెలుపొందారు. లక్షా పద్దెనిమిది వేల మెజారిటీ రావటం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక రికార్డు. అంతే కాకుండా ఆయన దేశంలో చిన్న వయసులోనే (47) ఆరు సార్లు ఎంఎల్యేగా ఎన్నికైన ఘనతను సాధించారు.
Post a Comment