దేశవ్యాప్తంగా కన్నడ మూవీ బజ్

దక్షిణాదిన తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పోలిస్తే సాధారణంగా కన్నడ సినిమాల గురించి ఇతర భాషా ప్రేక్షకులకు ఆసక్తి తక్కువే. ఈ మధ్య కిర్రాక్ పార్టీ, యు టర్న్ లాంటి చిత్రాలు వచ్చినా, విడుదలై విజయం సాధించిన తరువాతే వాటికి బయట రాష్ట్రాలలో ప్రచారం లభించింది. కానీ త్వరలో రానున్న చిత్రం KGF మాత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ఒక బజ్ క్రియేట్ చేయటంలో విజయం సాధించింది. యశ్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రధారులుగా కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 20న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన రెండవ ట్రయిలర్ ఇవాళ విడుదల అయింది.

 

సలాం రాకీ భాయ్ సాంగ్సెకండ్ ట్రయిలర్

0/Post a Comment/Comments

Previous Post Next Post