గజ్వేల్ నియోజక వర్గం ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందరికీ సుపరిచితం. కానీ ఈ నియోజక వర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడి ప్రజలు రాష్ట్ర పొలిటికల్ వేవ్ కు అనుగుణంగా ఓటేస్తారని, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది. కెసిఆర్ తన చివరి ప్రచార సభ అయిన గజ్వేల్లో ఈ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తూ ఇక్కడ తాను గెలిస్తే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్లేనని అనడంతో ప్రజలు పెద్దపెట్టున చప్పట్లు, కేకలతో హర్షం వ్యక్తం చేసారు.
గజ్వేల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటినుండి ఇక్కడి ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీకి మాత్రమే ఓటు వేసారు. ఒక్క 1983-85 మధ్యకాలంలో అంటే టిడిపి ఎన్నికల బరిలో దిగిన మొదటి సారి మాత్రం ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఆ తరువాత కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగింది. 1985లో సంజీవరావు (టిడిపి), 89లో గీతారెడ్డి (కాంగ్రెస్), 94లో విజయరామారావు (టిడిపి), 99లో సంజీవరావు (టిడిపి), 2004లో గీతారెడ్డి (కాంగ్రెస్), 2009లో నర్సారెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు.
ఈ నియోజకవర్గంలో కెసిఆర్ అడుగుపెట్టేవరకూ టిఆర్ఎస్ ఉనికి పెద్దగా లేదు. కానీ 2014లో కెసిఆర్ గెలవటమే కాకుండా టిఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ ఇక్కడ క్యాడర్‌ను పెంచుకోవటంతో పాటు బలమైన శక్తిగా కూడా మారింది.

Post a Comment