అంతరిక్షం - తెలుగు సినిమా రంగంలో మరో ప్రయోగం

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తెలుగు సినిమా రంగం ఈ మధ్య ప్రయోగాలకు సిద్ధపడుతోంది. బాహుబలి ఇతరభాషలలో కూడా విజయం సాధించిన తరువాత ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి, గూఢచారి, ఘాజి లాంటి సినిమాలు విజయం సాధించటంతోపాటు ఇతర భాషా ప్రేక్షకులను  కూడా ఆకర్షించాయి. ఈ నెల 21న విడుదలవుతున్న అంతరిక్షం 9000Kmph సినిమా కూడా ఇదే కోవలో తెలుగులో వస్తున్న తొలి అంతరిక్ష చిత్రంగా నిలవనుంది. ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళ భాషలో టిక్ టిక్ టిక్ పేరుతో ఇప్పటికే ఒక అంతరిక్ష చిత్రం వచ్చినా మసాలా కథనంతో ఎక్కువగా ఆకట్టుకోలేకపోయింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన దారులుగా ఈ సినిమా నిర్మితమైంది. ఇవాళ ఈ చిత్ర ట్రయిలర్‌ను విడుదల చేసారు. పాత్రలను పరిచయం చేస్తున్న వీడియోలు, టీజర్ కూడా ఇప్పటికే వచ్చాయి. 
 

0/Post a Comment/Comments

Previous Post Next Post