కూకట్‌పల్లి బరిలో నందమూరి సుహాసినిని నిలపటం బాబుకు లాభించనుందా?

కూకట్ పల్లి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపటం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి వ్యూహాత్మక నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ తనకే లభిస్తుందని ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన పెద్ది రెడ్డిని మరియు ఇతర ఆశావహులను కాదని మరీ ఈ సీటును ఆమెకు కేటాయించటం విశేషం. 

దీనివలన ఇటీవలి కాలములో బాలకృష్ణకు తప్ప ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరికీ తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదు అనే విమర్శలకు కొంతవరకు సమాధానం చెప్పినట్లవుతుంది. ఇటీవలే మరణించిన హరికృష్ణకు కూడా తగిన గౌరవం కల్పించినట్లయింది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారం చేయటానికి మార్గం కూడా సుగమం అయ్యే అవకాశముంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఇప్పటికే బలహీనపడిన ఈ దశలో ఆమె జయాపజయాలు ఎలా ఉన్నా చంద్రబాబుకు మాత్రం భవిష్యత్తులో ప్రయోజనం చేకూరే అవకాశముంది. 

0/Post a Comment/Comments