PSLV C-43 విజయవంతం


భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), ఇవాళ ఉదయం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి PSLV C-43 రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన HySIS ఇమేజింగ్ శాటిలైట్‌తో పాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో ముప్పై శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ 30 శాటిలైట్లలో ఒకటి మైక్రో శాటిలైట్ కాగా మిగతావి నానో శాటిలైట్లు. స్థానిక కాలమానం ప్రకారం  సరిగ్గా 09:57 నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. PSLV సిరీస్‌లో ఇది నలభై ఐదవ ప్రయోగం. 

హైపర్‌స్పెక్ట్రల్  ఇమేజింగ్ సాటిలైట్ (HySIS) అనేది ఇస్రో తయారు చేసిన అధునాతన ఉపగ్రహం. దీని బరువు  380 కిలోగ్రాములు (838 పౌండ్లు). ఐదు సంవత్సరాల పాటు సేవలందించగల ఈ ఉపగ్రహాన్ని 636 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రోనస్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టారు. ఇది పనిచేయటానికి అవసరమైన 730 వాట్ల విద్యుత్‌ను తనకున్న రెండు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటుంది. దీని ద్వారా లభించే ఫోటోలు ప్రధానంగా సైనిక అవసరాలతో పాటు, భూగర్భ పరిశోధన, వ్యవసాయ, అటవీ పరిశోధనలకు కూడా ఉపయోగపడుతాయి.


ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలలో అమెరికాకు చెందినవి 23 ఉండగా, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్ ల్యాండ్, మలేసియా, నెదర్లాండ్ మరియు స్పెయిన్ లకు చెందిన ఉపగ్రహాలు ఒక్కొక్కటి ఉన్నాయి. వీటిలో బ్లాక్-స్కై గ్లోబల్ (అమెరికా) సంస్థకు చెందిన గ్లోబల్-1 పెద్దది. మిగతావన్నీ నానో ఉపగ్రహాలు.  వీటన్నింటినీ HySIS ను ప్రవేశ పెట్టిన కక్ష్యలో కాకుండా 504 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మరో కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీనికోసం రాకెట్ యొక్క నాలుగవ దశలో ఇంజన్‌ను ఆపి మళ్ళీ స్టార్ట్ చేసారు. 


నాలుగు భాగాల PSLV రాకెట్ ప్రయోగంలో వివిధ దశలుంటాయి. వాటిని ఇక్కడ వివరంగా చూడవచ్చు.

0/Post a Comment/Comments

Previous Post Next Post