2.0 మూవీ రివ్యూ Rating: ⭐️⭐️⭐️½

2010లో వచ్చిన రోబోకి సీక్వెల్‌ అయిన 2.0 చిత్రాన్నివెండితెరపై విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందునుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడి గత సినిమాలలోలాగే దీనిలో కూడా అంతర్లీనంగా సెల్‌ఫోన్ రేడియేషన్ వలన పక్షి జాతులపై పడే దుష్ప్రభావంపై ఒక సామాజిక సందేశం కనిపిస్తుంది. 3Dలో రూపొందిన ఈ చిత్రంలో ఎంటర్టెయిన్‌మెంట్ పేరుతో  ఎక్కువగా పాటలు, అనవసర కామెడీ, హీరోయిన్ గ్లామర్ ప్రదర్శన లాంటివి కూడా ఉండకపోవటం మరో విశేషం.

చిత్ర కథ విషయానికి వస్తే చెన్నై నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో నుండి సెల్ ఫోన్లు మాయమవుతుంటాయి. దానితో పాటు కొన్ని హత్యలు కూడా జరుగుతాయి. ఈ రహస్యాన్ని ఛేదించటానికి సైంటిస్ట్ వశీకరన్ (రజనీకాంత్), తన హ్యూమనాయిడ్  రోబో చిట్టిని తిరిగి వినియోగంలోకి తీసుకువస్తాడు. ఆ తరువాత పక్షిరాజు (అక్షయ్ కుమార్), చిట్టిల మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. కాగా అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నంతగా ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేదు. అమీ జాక్సన్ పాత్ర కూడా పరిమితమే. చివరలో వచ్చే సన్నివేశాలు ఏ హాలీవుడ్ సినిమాకు తీసిపోవు. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ సాంకేతికంగా ఉన్నత విలువలతో రూపొందిన 2.0 3Dలో చూడదగ్గ సినిమా.

0/Post a Comment/Comments

Previous Post Next Post