ప్రముఖ రాజకీయ, వార్తా విశ్లేషకుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) ఇకలేరు. గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కెనడాలో చికిత్స తీసుకుంటూ అక్కడే మృతి చెందారు. పుత్రశోకంలో ఉన్న కొమ్మినేనిని పలువురు ప్రముఖులు ఫోన్‌లో పరామర్శించారు.
శ్రీహర్షకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. JNTU లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన తరువాత కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో వివిధ హోదాలలో పని చేసారు. గత నాలుగు సంవత్సరాలుగా కెనడా లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో అసోసియేట్ గా పని చేస్తున్నారు.
ప్రస్తుతం కొమ్మినేని సాక్షి టెలివిజన్లో లైవ్ విత్ కేఎస్ఆర్ అనే టాక్ షోను, మనసులో మాట పేరుతొ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. కుమారుడి అనారోగ్యం దృష్ట్యా ఆయన కొద్ది రోజుల క్రితమే కుటుంబ సమేతంగా కెనడా చేరుకుని అక్కడే ఉన్నారు. అందుకే కొమ్మినేని గత కొంతకాలంగా టాక్ షోలో కనిపించటం లేదు.
Post a Comment