వంతెనపై కవాతా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొవ్వూరు రాజమండ్రిల మధ్య గోదావరిపై ఉన్న రోడ్ కమ్ రైల్వే వంతెనపై ఈ నెల 9న నిర్వహించాలని తలపెట్టిన కవాతును నేతల సూచన మేరకు 15వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించారు. అలాగే కార్యక్రమాన్ని పాత వంతెన నుండి కొత్త వంతెనకు మారుస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే వంతెనలపై కవాతును నిర్వహించకూడదని ఆ నేతల కమిటీ పార్టీకి సలహా ఎందుకు ఇవ్వలేదో?

వంతెనలను దాటే సమయంలో సైనిక దళాలు కూడా చేసే కవాతు(మార్చింగ్)ను ఆపివేస్తాయి. అనునాదం (రెసోనెన్సు) వలన వంతెన కూలిపోకుండా ఈ విధమైన ముందు జాగ్రత్త తీసుకుంటారు. ఇది స్కూల్ సైన్సు పుస్తకాలలో అందరూ చదువుకునే విషయమే.

రాజకీయ పార్టీని 'సేన' అని,  'కార్యకర్తలను' సైనికులని సంభోధించుకునే వారి అలవాటు ప్రకారం పాదయాత్రను కవాతుగా అభివర్ణిస్తున్నారో లేక నిజంగానే కవాతు (మార్చింగ్) చేస్తున్నారో స్పష్టత లేదు. ఒకవేళ అది కవాతు కాకపొతే వంతెనలపై జరిపేటప్పుడు ఆ కార్యక్రమాన్ని వేరే పేరుతో జరుపుకుంటే సబబుగా ఉంటుంది.

0/Post a Comment/Comments