విమానం కూలిపోతే సెల్ఫీల కోసం ఎగబడ్డారు

భారత వాయుసేనకు చెందిన ఒక మైక్రో లైట్ విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగపత్ గ్రామంలోని చెఱుకు తోటలో కూలిపోయింది. అదృష్టవశాత్తు విమానంలోని ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన చోట చెరుకు తోటలో తలకిందులుగా ఉన్న చిన్న విమానంతో సెల్ఫీలు దిగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు పోటెత్తారు. 

విమాన సిబ్బందిని వెంటనే మరో హెలికాఫ్టర్లో అక్కడ నుండి తరలించారు. వైమానిక దళ ప్రతినిధి మాట్లాడుతూ జరిగిన ప్రమాదం పై దర్యాప్తు జరుపుతున్నామని, కారణాలు ఇంకా తెలియలేదని అన్నారు. ఇది విమానం కూలిపోవటం కిందకు రాదని, సాంకేతిక కారణాల వలన అననుకూల ప్రాంతంలో ల్యాండ్ కావలసి వచ్చిందని తెలిపారు. 

ప్రమాదానికి గురైన విమానాన్ని స్లోవేనియా తయారీ పిపిస్ట్రెల్ చిన్న విమానంగా ధృవీకరించారు. 80 ఈ తరహా విమానాల్ని భారత వైమానిక దళం మూడు సంవత్సరాల క్రితం ఆ దేశం నుండి కొనుగోలు చేసింది. కాగా ఈ సెప్టెంబరు 4 న రాజస్థాన్లోని జోధ్ పూర్లోని బనాడ్ సమీపంలో ఒక  మిగ్-27 యుద్ధ విమానం కూలిపోయింది. జూన్ నెలలో కూడా ఒక మిగ్-21 యుద్ధ విమానం హిమాచల్ ప్రదేశ్లో కూలిపోయింది.       

0/Post a Comment/Comments

Previous Post Next Post