ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు వెనుక వాల్‌మార్ట్ భారీ వ్యూహం

వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను 16 బిలియన్ డాలర్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయటం ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఈ-కామర్స్ ఒప్పందం. దీనిద్వారా ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్యలో రెండవ స్థానంలో ఉన్న మనదేశంలో వేళ్లూనుకోవటమే కాకుండా మరో భారీ వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

చైనాను మినహాయిస్తే ఎక్కడా అమేజాన్‌తో ఫ్లిప్‌కార్ట్‌లా రీటైల్ అమ్మకాలలో ప్రత్యక్షంగా పోటీపడుతున్న ప్రత్యర్థి ఎవరూ లేరు. ప్రపంచ వ్యాప్తంగా అమేజాన్‌తో  రీటైల్ రంగంలో పోటీ పడాలని భావిస్తున్న వాల్‌మార్ట్‌కు, ఫ్లిప్‌కార్ట్ అందివచ్చిన అవకాశంలా కనిపించింది. ఈ కొనుగోలు ద్వారా సొంతమైన ఫ్లిప్‌కార్ట్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచమంతటా ఉపయోగించుకోవాలని వాల్‌మార్ట్ భావిస్తోంది. ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని సమకూర్చుకోవటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. 

ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ సర్వర్ల ద్వారా లక్షలాది ఆర్డర్లను ఏకకాలంలో మనుషుల ప్రమేయం లేకుండా సురక్షితంగా ప్రాసెస్ చేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలలో ఫ్లిప్‌కార్ట్ ఎంతో అభివృద్ధిని సాధించింది. వీటి ద్వారా కొనుగోలు ట్రెండ్స్ ఎలా ఉండనున్నాయి?, భవిష్యత్తులో ఎలాంటి వస్తువులు అమ్మకాల కోసం అవసరమవుతాయి? వంటి ఎన్నో అంశాలను ఆటోమాటిగ్గా అంచనావేయవచ్చు. వందల మంది డేటా అనలిస్టులు ఇప్పుడు వాల్‌మార్ట్‌ సొంతమయ్యారు. అమెరికా మార్కెట్ పరంగా యోచిస్తే ఈ మానవ వనరులు, అనుభవం మరియు ఉపయోగించటానికి సిద్ధంగా ఉన్న సాఫ్ట్‌వేర్ వారికి ఎంతో విలువైనవి. అందుకే అమేజాన్‌తో పోటీపడి మరీ భారీ మొత్తానికి ఈ సంస్థను దక్కించుకుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post