ముందస్తు ఎందుకు? |
అందరూ అనుకున్నట్లుగానే ఇవాళ తెలంగాణ కేబినెట్ అసెంబ్లీ రద్ధుకు ప్రతిపాదించటం, ఆమోదం పొందటం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే తొమ్మిది నెలల గడువు ఉండగా ఎందుకు ముందస్తు వెళుతున్నారు? అనే దానిపై కెసిఆర్ జాతక బలంతో సహా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టిఆర్ఎస్ పార్టీ గత కొన్ని నెలలుగా కసరత్తు జరిపి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు విషయాన్ని ప్రకటించగానే, 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను ఆశ్చర్య పరిచారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు, పొత్తులు కుదుర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వకూడదనే ఉద్దేశ్యం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి ఒక కారణంగా భావిస్తున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకే సారి ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇది కాంగ్రెస్, బిజెపిలకు లాభించే అంశం. జమిలి ఎన్నికలు జరిగితే మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి భావించి ఉండవచ్చు.
Post a Comment