Telugunewz.com |
ఇప్పటి వరకు సంకురాత్రికోసారి, శివరాత్రికోసారి అన్నట్టు అప్ డేట్ అవుతున్న Telugunewz.com పూర్తిస్థాయి తెలుగు వెబ్ పత్రికగా మారనుంది. దీనికి సంబందించిన వెబ్ సైట్ ఏర్పాట్లు, ఆఫీస్ ఏర్పాటు చేసే పనులు మరియు రిక్రూట్మెంట్ ప్రారంభమయ్యాయి. నవంబర్/ డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో ప్రచురించాలని భావిస్తున్నాము. కేవలం వార్తలు, విశ్లేషణలకు మాత్రమే పరిమితమవకుండా చదువరులను ఆకర్షించే అన్ని రకాల రచనలకు స్థానం కల్పించనున్నాము.
ఈ ఆన్‌లైన్ పత్రిక ఏర్పాటు విషయంలో మీ అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్స్ లేక Contact US లో ఉన్న మెయిల్ ద్వారా తెలుపవలసినదిగా మా ప్రార్థన.
అంతేకాకుండా ఎవరైనా ఈ పత్రికకు తమ రచనలు పంపే విధంగా, అంటే సోషల్ కాంట్రిబ్యూషన్ ద్వారా రచనలు/ వార్తలు స్వీకరించాలని భావిస్తున్నాం. ప్రచురించబడిన ప్రతి రచన కు కొంత పారితోషికం కూడా అందించాలని భావిస్తున్నాము. మాది ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న సంస్థ కావున, మాకున్న ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఇది పరిమితం గానే ఉండవచ్చు. పత్రిక పూర్తి స్థాయిలో ప్రారంభమైన తరువాత సోషల్ కాంట్రిబ్యూషన్ విధి విధానాలను ప్రకటించనున్నాము. దీనిపై కూడా మీ సలహాలు/ సూచనలు ఆహ్వానిస్తున్నాం.
Post a Comment