మరో రికార్డు

Telangana Genco CMD at Pulichintala
Telangana Genco CMD at Pulichintala
ఊహించినట్లుగానే తెలంగాణాలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న అంటే సెప్టెంబర్ 10వ తేదీ, సోమవారం మధాహ్నం 12 గంటల 31 నిమిషాలకు డిమాండ్ 10749 మెగావాట్ల గరిష్టస్థాయికి చేరింది. దీనితో ఈ నెల 7వ తేదీన నమోదైన 10,601 మెగావాట్ల ఆల్ టైం పీక్ డిమాండ్ ను అధిగమించినట్లయింది.

తాజా అప్డేట్ 

ఇవాళ అంటే మంగళవారం ఉదయం 7 గంటల 31 నిమిషాలకు డిమాండ్ 10,818 మెగావాట్లకు చేరి నిన్నటి రికార్డును అధిగమించింది.

వచ్చే కొన్ని రోజులలో మరిన్ని రికార్డులు సృష్టించటం ఖాయంగా విద్యుత్ వర్గాలు తెలియచేస్తున్నాయి.  వ్యవసాయ విద్యుత్ డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతుండటం, వినాయక మంటపాలలో భారీ స్థాయిలో విద్యుత్ వినియోగం, ఎల్బీ నగర్- అమీర్ పేట్ మెట్రో ప్రారంభమవనుండటంతో వినియోగం భారీ స్థాయిలో పెరగనుంది. 

ఒక రాష్ట్ర విద్యుత్ వినియోగం పెరగటం, ఆ రాష్ట్ర అభివృద్ధిని సూచిస్తుందని జెన్ కో అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 5400 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను తట్టుకోవటానికి కోతలు విధించాల్సి వచ్చిందని, ఇప్పుడు అటువంటి సమస్యలేవీ లేవని వారు తెలిపారు. ఇప్పుడు 14000 మెగావాట్ల వరకు డిమాండ్ పెరిగినా సరఫరా చేయగలమని అన్నారు. నిన్నటి రోజు మొత్తం 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త రికార్డుని సృష్టించారు. ఈ వారంలోనే  పులిచింతలలో 120 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ జెన్ కో, ఈ నెల లోనే కొత్తగూడెంలో మరో  800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంలో కూడా వాణిజ్య సరళిలో ఉత్పత్తి ప్రారంభించనుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post